top of page

PM E-Drive: ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొనుగోలుపై.. కేంద్రం సబ్సిడీ ఎంతిస్తుంది? EV Zone News

PM E-Drive: దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈవీల వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పేరుతో కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీవీలర్లు, ట్రక్కులు, బస్సులు, అంబులెన్సుల కొనుగోలుపై రాయితీ అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం అక్టోబర్ 1, 2024 నుంచే అమలులోకి వచ్చింది. ఈ స్కీమ్ మార్చి 31, 2026 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. మరి ఇందులో రాయితీ ఎంతొస్తుంది?




అయితే, ఈ పథకం అమలులోకి తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతున్నా ఇంకా అమలు కావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హన్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం రూ.10,900 కోట్ల నిధులు కేటాయించారు. గతంలో తీసుకొచ్చిన పథకాల స్థానంలో ఈ కొత్త స్కీమ్ లాంచ్ చేసింది కేంద్రం. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ సెప్టెంబర్ 30తో ముగిసింది.


ఏ వాహనానికి ఎంత సబ్సిడీ వస్తుంది?


పీఎం ఇ-డ్రైవ్ పథకం ప్రధానంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, వాణిజ్య త్రీ వీలర్లకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లోని రిజిస్టర్డ్ విద్యుత్తు టూ వీలర్లకు రాయితీలు వర్తిస్తాయి. వాటితో పాటు ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులకు రాయితీ ఇస్తామని చెబుతోంది. అయితే, అధునాత బ్యాటరీలు అమర్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి మాత్రమే రాయితీ లభిస్తుంది. ఈ బ్యాటరీ సామర్థ్యం ఆధారంగానే రాయితీ ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే పథకం అమలయ్యే రెండేళ్లలో తొలి ఏడాది ఇచ్చే సబ్సిడీతో పోలిస్తే రెండో ఏడాది సగానికి తగ్గనుంది.


రెండేళ్లలో గరిష్ఠంగా రూ.24,79,120 ఎలక్ట్రిక్ టూ వీలర్లకు సబ్సిడీ అందించనున్నారు. ఇందుకోసం రూ.1772 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొంటే తొలి ఏడాది ఒక కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటే రూ.5 వేల రాయితీ లభిస్తుంది. మొత్తం సబ్సిడీ రూ.10 వేలు లభిస్తుంది. ఇక రెండో ఏడాదికి వస్తే అది కిలోవాట్ అవర్ సామర్థ్యానికి రూ.2500 ఉంటుంది. మొత్తంగా రూ.5 వేలకు మించదు. ఎలక్ట్రిక్ త్రీవీలర్లు తొలి ఏడాదిలో రూ.25 వేల సబ్సిడీ లభిస్తుంది. ఇక రెండో ఏడాదిలో అది రూ.12,500 అందుతుంది. గరిష్టంగా 1,10,596 ఈ-రిక్షాలు, ఈ-కార్టులకు రాయితీ లభిస్తుంది. అలాగే ఎల్5 త్రీవీలర్లలో 2,05,392 వాహనాలకు సబ్సిడీ ఇవ్వనుంది.


సబ్సిడీ పొందాలంటే ఏం చేయాలి?


పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా రాయితీ పొందాలంటే ఆధార్ ఉండాలి. ఒక ఆధార్ నంబర్‌పై ఒకే బండికి రాయితీ ఇస్తారు. మోటారు వాహనాల చట్టం 1989 కింద రిజిస్టర్ చేయాలి. పీఎం ఈ-డ్రైవ్ మొబైల్ యాప్‌ ద్వారా ఫేస్ మొడాలిటీని ఉపయోగించి అథెంటికేట్ చేయాలి. ఆ తర్వాత ఫోటో గుర్తింపు కార్డును డీలర్లకు అందించాలి. పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ ఇవ్వొచ్చు. వాటిని పీఎం ఇ-డ్రైవ్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఆ తర్వాత యాప్ ద్వారానే సబ్సిడీ ఓచర్ వస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిపై సంతకం చేసి డీలర్ కు ఇవ్వాలి. దానిపై డీలర్ సంతకం చేసి ఒక కాపీ వినియోగదారుకు ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే సబ్సిడీ వస్తుంది.



Published by EV Zone News Blog




 
 
 

Commentaires


Contact us:
Email: hello@amityev.com
Address: #302, Ritesh Towers

Karkhana Junction,

Secunderabad-500015

Telangana. India

Subscribe to Our Newsletter

Connect With Us

  • Whatsapp
  • Facebook
  • Youtube

Disclaimer : Under no circumstances shall company or its affiliates be liable for indirect, incidental, consequential, special or exemplary damages arising out of any communication or commitment or false representation made by any person on behalf of company. Actual product color may vary from the website Image.

© 2025 by AmityIndia.net - All rights reserved.

bottom of page