Amity EV | 80 కి.మీ. వేగంతో 200 కి.మీ. వరకూ దూసుకెళ్లే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది!
- amityebike
- Nov 24, 2024
- 1 min read
ఎలక్ట్రిక్ స్కూటర్లంటే 25-40 స్పీడ్ తో వెళతాయి కదా.. కాని ఇటీవలే ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన Amity EV ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ లాంచ్ చేయబోతున్న మోడల్ ఏకంగా 80 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ. వరకు ఆగకుండా పరుగులు తీస్తుంది. Amity EV త్వరలో రిలీజ్ చేయబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి.
మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు రోజు రోజుకూ పెరగబోతోంది. ఇప్పుడు ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి సరి కొత్త కంపెనీ Amity EV - త్వరలో లాంచ్ చేయబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షించబోతోంది.

2.5 kWh బ్యాటరీతో ఈ స్కూటర్ వస్తోంది. దీని మోటార్ 150 Nm టార్క్‌ను అందిస్తుంది. స్కూటర్ 80 km/h వేగాన్ని అందుకుంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కి.మీ. రేంజ్ వరకు ఆగకుండా దూసుకుపోతుంది. అంతేకాకుండా కేవలం మూడు నుండి నాలుగు గంటలు ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. ఇది మాక్సిమం 80 కి.మీ. వేగాన్ని అందుకుని పరుగులు పెడుతుంది.
86 కిలోల బరువు (బ్యాటరీతో సహా) రాబోతున్న ఈ స్కూటర్ మూడు డ్యూయల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్నోఫ్లేక్ వైట్, ఫైర్ ప్యూరీ డార్క్ రెడ్, స్లేట్ గ్రే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. అందువల్ల ఎంత వేగంగా దూసుకుపోతున్నా బ్రేక్ వేస్తే వెంటనే బండి ఆగుతుంది. ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కులు, వెనుక హైడ్రాలిక్ మోనో-షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. అందువల్ల మీకు అసలు కుదుపులు, గుంతల సమస్య ఉండదు. ముఖ్యంగా ఒళ్లు, నడుము నొప్పులు రాకుండా ఉంటాయి.
ఈ స్కూటర్ లో ఉన్న TFT స్క్రీన్ స్పీడోమీటర్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఛార్జింగ్ ఎంత తదితర ముఖ్యమైన సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. ఈ వెర్షన్ 80 km/h వేగాన్ని అందుకుంటుంది.

త్వరలో Amity EV అనేక ఇతర మోడల్స్ కూడా లాంచ్ చేయబుతున్నట్టు, హైదరాబాద్ కు చెందిన Amity EV కంపెనీ సీఈఓ శ్రీ శ్రీనివాస్ గారు ఒక ప్రకటనలో తెలియచేసారు.
published by EV Zone News Bulletin
Comments